Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌కు బ్రేక్.. దుబాయ్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్న ఎన్టీఆర్!

  • రామరాజు అనే పవర్‌ఫుల్ పాత్రలో చెర్రీ
  • సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటున్న ‘ఆర్ఆర్ఆర్’
  • స్వామి కార్యం, స్వకార్యం చక్కబెడుతున్న ఎన్టీఆర్
రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌కు కొద్ది రోజులు బ్రేక్ పడిందట. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. చెర్రీ ‘ఆర్ఆర్ఆర్’లో రామరాజు అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి పూర్తిగా విరామమిచ్చారో లేదంటే ఎన్టీఆర్‌కు సంబంధించిన ఈ షెడ్యూల్ షూటింగ్ పూర్తయిందో కానీ యంగ్ టైగర్ మాత్రం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ చెక్కేశాడు. అయితే అక్కడ స్వామి కార్యం.. స్వకార్యం రెండూ చక్కబెడుతున్నాడట. ఒకవైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’లో తన పాత్రకు కావల్సిన కాస్ట్యూమ్స్ కొనుక్కోవడంతో పాటు బాడీ మేకోవర్‌ని మెరుగుపరుచుకునేందుకు స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటాడట. ఈ నెలాఖరు వరకూ తారక్ దుబాయ్‌లోనే ఉంటాడని సమాచారం.  
Rajamouli
NTR
RRR
Ram Charan
Ramaraju
Dubai

More Telugu News